అసభ్యకర పోస్టులతో యువతిని వేధిస్తున్న మైనర్..

V6 Velugu Posted on Apr 08, 2021

గచ్చిబౌలి,వెలుగు: యువతి సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేసి అందులో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్న మైనర్​ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి(25) మెడిసిన్ చదువుతోంది. కొన్నిరోజుల క్రితం ఆమె ఫేస్​బుక్ అకౌంట్ల నుంచి అసభ్యకర పోస్టులు, కామెంట్స్ అప్ లోడ్ అయ్యాయి.  దీంతో ఆ యువతి తన ఇంటిపక్కన ఉండే మైనర్(14) సాయంతో తన మెయిల్ ఐడీని. ఫేస్ బుక్ అకౌంట్​ను బ్లాక్ చేసింది. తర్వాత ఆ యువతి ఆన్ లైన్ క్లాసుల్లో లాగిన్ అయ్యేందుకు కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంది.  కొన్ని రోజులకు యువతి ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ అయి అందులో అసభ్యకర పోస్టులు కనిపించాయి. ఆమె కొత్త ఈ–మెయిల్ కు  మళ్లీ మెసేజ్​లు, గుర్తు తెలియని నంబర్స్ నుంచి వాట్సాప్ మెసేజ్​లు ,ఫోన్ కాల్స్ రావడంతో  సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పక్కింటి బాలుడే..  

అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తోన్నది ఆమె ఇంటి పక్కన ఉండే మైనర్ బాలుడేనని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.  అతడు యువతితో సన్నిహితంగా ఉంటూ గతంలో ఆమె ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్స్ ప్రాబ్లమ్ రావడంతో వాటిని క్లోజ్ చేయడంలో హెల్ప్ చేశాడు. తర్వాత యువతి మెయిల్ ఐడీ పాస్ వర్డ్ ను  చేంజ్ చేసి లాగిన్​ అయ్యాడు. మొదట్లో యువతి ఫేస్​బుక్​లో  అసభ్యకర పోస్టులు చేసి ఆమె సోషల్ మీడియా అకౌంట్లను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు  నమ్మించాడు. ఆ అకౌంట్​ను మళ్లీ రీ యాక్టివేట్ చేసి యువతి ఫొటోలను, అసభ్యకరమైన పోస్టులను పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.  మైనర్​ను అబ్జర్వేషన్ హోంకు తరలించారు.ఉంటాయని అంటున్నారు. 
 

Tagged Cyberabad police, hack, social media accounts

More News