మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ముజ్రా పార్టీ .. ఆరుగురు యువకులు అరెస్టు

మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ముజ్రా పార్టీ .. ఆరుగురు యువకులు అరెస్టు
  • డీజే సౌండ్లతో యువతుల అర్ధనగ్న డ్యాన్సు
  • ఎస్‌‌‌‌ఓటీ పోలీసుల దాడులు

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ లో ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్న ఓ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌పై సైబరాబాద్ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడులు చేశారు. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న నలుగురు యువతులు, ఆరుగురు యువకులను అరెస్ట్‌‌‌‌ చేశారు. నిందితుల వద్ద రెండు కార్లు, మ్యూజిక్  సిస్టం, సెల్ ఫోన్లు, రూ.12,160 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్  టోలిచౌకికి చెందిన రెహన్  సిద్ధ చౌహన్  ఆటో డ్రైవర్. అతని భార్య అర్కెస్ట్రా సింగర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు.

రెహన్  టోలిచౌకిలో ఉండే తన ఐదుగురు స్నేహితులతో కలిసి ముజ్రా పార్టీకి ప్లాన్  చేశాడు. ఇందు కోసం మొయినాబాద్  సురంగల్ సమీపంలోని ఆర్ఎస్ ఫామ్‌‌‌‌హౌస్ ను అద్దెకు తీసుకున్నాడు. రెహన్ భార్యతో పాటు ఆర్కెస్ట్రా డ్యాన్సర్స్ గా పనిచేసే ఢిల్లీకి చెందిన చెందిన ఇద్దరు, హైదరాబాద్‌‌‌‌కు  చెందిన మరో ఇద్దరు యువతులతో సోమవారం రాత్రి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు.

అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా.. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు 2 గంటల సమయంలో ఫామ్ హౌస్ కు చేరుకుని సోదాలు చేశారు. నలుగురు యువతులు సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారికి డ్రగ్స్  టెస్ట్  నిర్వహించగా డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.