షాపింగ్​ మాల్స్, మల్టీప్లెక్స్​ల వద్ద ట్రాఫిక్ కంట్రోలింగ్ ఉండాలి : సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ

 షాపింగ్​ మాల్స్, మల్టీప్లెక్స్​ల వద్ద ట్రాఫిక్ కంట్రోలింగ్ ఉండాలి : సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ

గచ్చిబౌలి, వెలుగు: షాపింగ్​ మాల్స్, మల్టీప్లెక్స్​ల వద్ద ట్రాఫిక్ కంట్రోలింగ్ ఉండాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్​ల మేనేజ్​మెంట్లతో​ గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్​వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఆయా మేనేజ్ మెంట్లు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలన్నారు.

ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద స్పెసిఫికేషన్లతో పాటు పార్కింగ్ ఏరియా క్రమపద్ధతిలో ఉండాలన్నారు. అన్ని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల మేనేజ్ మెంట్లు సహకారం అందిస్తేనే ట్రాఫిక్ కంట్రోలింగ్ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయా ఏరియాలకు సంబంధించిన సెక్టార్ ఎస్ఐ, ఇన్ స్పెక్టర్ల  మొబైల్ నంబర్లు అందుబాటులో ఉంచుకుని.. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారికి సమాచారం అందించాలన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు  పాల్గొన్నారు.