సిమ్​స్వాపింగ్​తో రూ. 85.90లక్షలు కొట్టేశారు

సిమ్​స్వాపింగ్​తో రూ. 85.90లక్షలు కొట్టేశారు
  • ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ అకౌంట్స్ టార్గెట్‌‌
  • కంపెనీల మెయిల్స్‌ హ్ యాక్

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ అకౌంట్స్‌‌ను టార్గెట్‌‌ చేసి రూ.85.90లక్షలు కొట్టేశారు. ఫిష్షింగ్‌‌ మెయిల్స్‌‌, సిమ్ స్వాపింగ్‌‌తో గంటల వ్యవధిలోనే మనీ ట్రాన్స్​ఫర్​చేశారు. కోల్‌‌కతా అడ్డాగా సాగుతున్న సిమ్‌‌ స్వాపింగ్‌‌కి అకౌంట్స్‌‌ సప్లయ్ చేస్తున్న వ్యక్తిని సోమవారం హైదరాబాద్‌‌ సైబర్‌‌‌‌క్రైమ్ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. నిందితుని నుంచి మొబైల్ ఫోన్ సీజ్‌‌ చేశారు. జాయింట్‌‌ సీపీ అవినాశ్ మహంతి వివరాలు వెల్లడించారు. రాణిగంజ్‌‌‌‌కి చెందిన మెటల్‌‌ వ్యాపారి డీసీబీ బ్యాంక్‌‌లో మూడు అకౌంట్స్‌‌ యూస్‌‌ చేస్తున్నాడు. మొబైల్‌‌ నంబర్‌‌, యాహు మెయిల్‌‌ ఐడీకి వచ్చే ఓటీపీ ఆధారంగా మనీ ట్రాన్సాక్షన్‌‌ చేశేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్‌‌‌‌ 4న మూడు అకౌంట్స్‌‌లో ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ బ్యాలెన్స్‌‌ చెక్‌‌ చేసుకున్నాడు. తన అకౌంట్‌‌లో  రూ.35,89,899 ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్‌‌ ఉన్నట్లు గుర్తించాడు. ఇంటర్నెట్‌‌ బ్యాంకింగ్‌‌లో ఐదు కొత్త బెన్‌‌ఫిషర్‌‌ అకౌంట్స్‌‌ యాడ్‌‌ అయినట్లు తెలుసుకున్నాడు. మే 20న తన సిమ్‌‌ కార్డ్‌‌ స్వాప్‌‌ చేసి ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ను ట్రాన్స్‌‌ఫర్స్‌‌ చేసినట్లు సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బంజారాహిల్స్‌‌ వ్యాపారి నుంచి రూ.50 లక్షలు

బంజారాహిల్స్‌‌కి చెందిన కన్‌‌స్ట్రక్షన్‌‌ వ్యాపారి అకౌంట్‌‌ నుంచి రూ.50 లక్షల ఓవర్‌‌‌‌ డ్రాఫ్‌‌ అమౌంట్‌‌ కొట్టేశారు. సిమ్‌‌ స్వాపింగ్‌‌తో మూడు ఫేక్ బెన్‌‌ఫిషరీలను యాడ్‌‌ చేశారు. ఓటీపీ నంబర్స్‌‌తో ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ మనీ ట్రాన్స్‌‌ఫర్ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో బ్యాంక్‌‌ అకౌంట్‌‌తో లింకైన మొబైల్‌‌ నంబర్‌‌‌‌ మరొకటి మద్రాస్‌‌లో ఇష్యూ అయినట్లు గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. మనీ ట్రాన్స్‌‌ఫరైన బ్యాంక్‌‌ డీటైల్స్‌‌ ఆధారంగా విశాఖపట్నానికి చెందిన తమరన చిరంజీవి(38)ను అరెస్ట్‌‌ చేశారు.

కంపెనీల్లోనూ..

కమీషన్‌‌ బేసిస్‌‌లో కోల్‌‌కతా సిమ్‌‌ స్వాపింగ్‌‌ గ్యాంగ్‌‌కి చిరంజీవి బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌ సప్లయ్‌‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోల్‌‌కతా గ్యాంగ్‌‌ పేరున్న కంపెనీలకు ఫిషింగ్‌‌ మెయిల్స్ పంపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రీఫండ్‌‌ అకౌంట్స్‌‌ హ్యాక్‌‌ చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీల ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ అకౌంట్స్‌‌నే టార్గెట్‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఇలా చిరంజీవి అందించిన బ్యాంక్‌‌ డిటెయిల్స్‌‌ ఆధారంగా రూ.85.90 లక్షల ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ అమౌంట్‌‌ కొట్టేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌ తెలిపారు. ఫిష్షింగ్‌‌ మెయిల్ లింక్స్‌‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.