
తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో ఇవాళ్టినుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
బుధవారం అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడని మరింత బలపడి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి తో డు ఉపరితల చక్రవాక ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం సమీపానికి గురువారం మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తర్వాత పశ్చిమ ఆగ్నేయ దిశలో కదులుతూ మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
అల్పపీడనం కారణంగా బుధవారం సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక గురువారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం దని తెలిపింది.
గురువారం.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
శుక్రవారం.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వాయుగుండం కారణంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షఆలు కురిసే ఛాన్స్ ఉంది.
శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
అల్పపీడనం, వాయుగుండం కారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం, భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.