సైక్లోన్ మిచౌంగ్ ఎఫెక్ట్.. 13రైళ్లు రద్దు

సైక్లోన్ మిచౌంగ్ ఎఫెక్ట్.. 13రైళ్లు రద్దు

మిచౌంగ్ తుపాను మరికాసేపట్లో బాపట్ల తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున, సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ తదితర ఎనిమిది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.

తమిళనాడులోని ఎనిమిది ప్రదేశాలలో అధికారులు మొత్తం 236 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు వరకు 9,634 మందికి ఆహారం, నీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలను అందించారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కారణంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 6, 2023న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం తెలిపింది. ఈ క్రమంలోనే దక్షిణ రైల్వే ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రైళ్లను రద్దు చేసింది.. పాక్షికంగా రద్దు చేసింది. అందులో..

  1.  సూళ్లూరుపేట-నెల్లూరు (06745)
  2. నెల్లూరు-సూళ్లూరుపేట (06746)
  3. నెల్లూరు-సూళ్లూరుపేట (06750)
  4.  సూళ్లూరుపేట-నెల్లూరు (06751)
  5. నెల్లూరు-సూళ్లూరుపేట (06748)
  6. సూళ్లూరుపేట-నెల్లూరు (06747)
  7. చెన్నై సెంట్రల్-తిరుపతి (16053)
  8. చెన్నాల్ సెంట్రల్-ముంబై LTT (22180)
  9. చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238)    
  10. చెన్నై సెంట్రల్-తిరుపతి (16203)
  11. తిరుపతి-చెన్నై సెంట్రల్ (16204)
  12. తిరుచ్చిరాపల్లి - హౌరా (12664)
  13. కోయంబత్తూరు-బరౌని (06059)