తుఫాన్ అలర్ట్ : రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్ కు సెలవు

తుఫాన్ అలర్ట్ : రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్ కు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 6న (బుధవారం) పాఠశాలలన్నింటినీ మూసివేయాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసిన కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం గజపతి.. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు డిసెంబర్ 6న మూసివేయబడతాయని చెప్పారు.

గతంలో, ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) మిచౌంగ్ తుఫాను ల్యాండ్‌ఫాల్‌ను ముందుగానే ఊహించి.. దాని అధికార పరిధిలోని 60 రైళ్లను రద్దు చేసింది. అదనంగా, ECoR మిచౌంగ్ తుఫానుకు సంబంధించిన పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక క్రైసిస్ మేనేజ్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 6న గంజాం, గజపతి, పూరి, నయాగర్, ఖుర్దా, కటక్, జగత్‌సింగ్‌పూర్, కంధమాల్, కోరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD యెల్లో హెచ్చరిక జారీ చేసింది.