-copy-2_N7S3OfcPdm.jpg)
- అన్ని జిల్లాల్లోని హాస్పిటళ్లలో ఏర్పాటు : రమేశ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ దవాఖాన్లలో డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(ఎర్రగడ్డ), గాంధీ హాస్పిటల్ సహా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులలో సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి సెంటర్‌లో సైకియాట్రిస్ట్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ఒక్కో సెంటర్‌లో పది బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిసలైన వారికి ఈ సెంటర్లలో కౌన్నెలింగ్, అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తామన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వాస్తవానికి, రాష్ట్రంలో ఇన్నాళ్లు ఒకటే డీఅడిక్షన్ సెంటర్(ఎర్రగడ్డ) అందుబాటులో ఉంది. మరిన్ని డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, ఇప్పటికే ఉన్న దవాఖాన్లలో ఏర్పాటు చేశారు.