సొంత గూటికి డీఎస్

సొంత గూటికి డీఎస్

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ మళ్లీ సొంత గూటికి చేరనున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారంటూ గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ డి. శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జనవరి 24న డీఎస్.. పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ పనిచేశారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగానూ ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ లో ప్రాధాన్యం లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు డీఎస్ సొంతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో జరిగిన భేటీలో ఆమె డీఎస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

మలయాళ సూపర్ స్టార్కు కరోనా

నిర్మలా సీతారామన్ తో రాష్ట్ర బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్