మలయాళ సూపర్ స్టార్కు కరోనా

V6 Velugu Posted on Jan 16, 2022

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మమ్ముట్టి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం జ్వరం మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్న కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. స్వల్ప జ్వరం మినహా ఇతర సమస్యలేవీ లేవు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండండి. ఎల్లవేళలా మాస్క్ ధరించండి' అంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  

70ఏళ్ల మమ్ముట్టి ప్రస్తుతం 'సీబీఐ 5' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఆ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. 'సీబీఐ 5'లో మమ్ముట్టి సేతురామన్ అయ్యర్ అనే కీలకపాత్రలో కనిపించనున్నారు. 

ఇవి కూడా చదవండి..

గోవాలో 10 – 15 సీట్లలో శివసేన పోటీ 

పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం

Tagged COVID19, Corona Positive, Malayalam, superstar, Mammootty

Latest Videos

Subscribe Now

More News