గోవాలో 10 – 15 సీట్లలో శివసేన పోటీ 

గోవాలో 10 – 15 సీట్లలో శివసేన పోటీ 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఎన్సీపీతో కలిసి బరిలో దిగనున్నట్లు చెప్పారు. గోవాలో 10 నుంచి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని పోటీలో నిలిపే అవకాశముందన్న సంజయ్ రౌత్.. ఎన్సీపీతో సీట్ల సర్దుబాటుపై ఈ నెల 18న చర్చించనున్నట్లు చెప్పారు. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తో గోవాలో జరగనున్న భేటీ అనంతరం ఏయే స్థానాల్లో పోటీ చేస్తారన్న విషయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలు ఇప్పటికే భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహించడంపై సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. గోవాలో ఆప్ బలంగా ఉందంటున్న కేజ్రీవాల్.. పదే పదే ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఆయన గోవాలో ప్రచారం చేయడంపై సంజయ్ రౌత్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం