రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం
V6 Velugu Posted on Jan 16, 2022
సూర్యాపేట : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. కోదాడ అనంతగిరి మండల కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయలేని ప్రభుత్వం రైతు బంధు సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎరువులు ఫ్రీగా ఇస్తామని 2017లో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు.. ఇప్పుడు 50శాతం ధరలు పెంచిందని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పోలీసు శాఖ వారు ఒక్కటయ్యారని ఆరోపించిన ఆయన.. పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజార్టీ సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
సమాజ్వాదీ పార్టీలో చేరిన ధారాసింగ్
ఝార్ఖండ్లో ఈ నెలాఖరు వరకు కరోనా ఆంక్షలు
Tagged TRS, Congress, Uttam Kumar, assembly election, telgngana