సమాజ్వాదీ పార్టీలో చేరిన ధారాసింగ్

సమాజ్వాదీ పార్టీలో చేరిన ధారాసింగ్

లక్నో: యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మధుబన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ధారా సింగ్ చౌహాన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైని తర్వాత బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలో  చేరిన మూడో మంత్రి ధారాసింగ్ కావడం విశేషం. మౌర్య, ధరమ్ సింగ్ సైనితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. కాగా, అఖిలేష్ యాదవ్‌ను యూపీ తదుపరి ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకు రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ధారాసింగ్ చెప్పారు. 2017లో వెనుకబడిన వర్గాల ఓట్లతో గెలిచిన బీజేపీ ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడంతోనే ఎస్పీలో చేరినట్లు స్పష్టం చేశారు. బీజేపీని ఓడించి, గద్దె దింపేందుకు ఎస్‌పీలో చేరిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. కలిసికట్టుగా పోరాడి బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తామని ధారా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000

ఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ