ఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ

ఉత్తర భారత దేశంలో చలి పంజా విసురుతోంది. పొగ మంచుకు తోడు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు దర్శనం ఇవ్వడం లేదు. ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ప్రజలు చలి మంటలు కాచుకుంటున్నారు. మరోవైపు దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301 గా నమోదైంది. ఈ నెల చివరి వరకు చలిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫుట్ పాత్ లపై నిద్రపోయే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.