- ఎవరూ ఆపకుండా వాహనంపై వాటర్ బోర్డు, బల్దియా లోగో
- రిజర్వాయర్ల నీళ్లు సురక్షితమన్న బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
- ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా
హైదరాబాద్‌సిటీ, వెలుగు :నగరానికి తాగునీరందించే ఉస్మాన్ సాగర్(గండిపేట) రిజర్వాయర్‌లో మురుగునీటిని డంప్‌చేసిన ట్యాంకర్‌ను సీజ్‌చేసి డ్రైవర్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. బుధవారం 8 గంటలకు హిమాయత్ నగర్ వద్ద ఉన్న ఎఫ్టీఎల్పాయింట్ నంబర్ 428 వద్ద టీజీ11 టీ1833 నంబర్‌గల సెప్టిక్ ట్యాంకర్ మురుగునీటిని జలాశయంలోకి వదలడానికి ప్రయత్నించగా పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు.
ఈ విచారణలో డ్రైవర్ రమావత్ శివనాయక్ (33), హిమాయత్ నగర్ వాసి నిరంజన్ చెప్పినందుకే చేశానని అంగీకరించారు. విచారణలో ట్యాంకర్‌పై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ లోగో వినియోగించారని, ప్రజలను, అధికారులను నమ్మించి తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చేసినట్టు వాటర్‌బోర్డు అధికారులు తేల్చారు.
ఆరు నెలల్లో ఎస్టీపీలు పూర్తి..
జంట రిజర్వాయర్లలోకి చుట్టుపక్కల నుంచి సీవరేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుందని, రిజర్వాయర్‌కు రెండు వైపులా ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, ఆరు నెలల్లో ఇవి పూర్తవుతాయని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ఎస్టీపీలు కంప్లీట్అయితే ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే సీవరేజ్ ని వందశాతం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఉస్మాన్ సాగర్ లోఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వాటర్‌బోర్డు గండిపేట నీటిని ఆసిఫ్ నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి ప్రతి గంటకూ క్వాలిటీ చెక్చేస్తున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ల పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే, స్థానిక అధికారులకు లేదా వాటర్‌బోర్డు 155313 కస్టమర్ కేర్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
