హైదరాబాద్ సిటీ, వెలుగు: భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి శుక్ర, శనివారాలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశాన్ని సెక్షన్ 163 కింద నో-ఫ్లై, నో -డ్రోన్ జోన్‌గా ప్రకటించారు.
రాచకొండ కమిషనరేట్‌లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు, యూఏబీ, రిమోట్లీ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, పారా గ్లైడర్లు, బెలూన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరే ఇతర వైమానిక వస్తువులను ఎగరవేయడం నిషేధించినట్టు సీపీ సుధీర్ బాబు తెలిపారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
