Hardik Pandya: బ్యాటింగ్ కంటే.. భామ మీదే హార్దిక్ ఎక్కువ ఫోకస్

Hardik Pandya: బ్యాటింగ్ కంటే.. భామ మీదే హార్దిక్ ఎక్కువ ఫోకస్

Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ లోని సూపర్–8 దశలో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయి, తీవ్ర ఒత్తిడిలో పడింది. దీంతో గురువారం ( ఫిబ్రవరి 26న) జింబాబ్వే జట్టుతో జరిగే మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు ఇవాళ చెన్నైకు చేరుకుంది. ఈ కీలక మ్యాచ్ కి ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌంటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత జట్టు చెన్నైకు చేరుకున్న సమయంలో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి కనిపించాడు. జట్టు బస్సు వైపు నడుస్తున్నప్పుడు ఆమె భుజంపై చేయి వేసి నడుచుకుంటు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ టోర్నమెంట్ మొత్తం మహికా శర్మ హార్దిక్‌తో పాటు ప్రయాణిస్తూ, మ్యాచ్‌లకు హాజరవుతూ కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద పెద్ద టూర్లు ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్ల కుటుంబ సభ్యులు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌కు బీసీసీఐ అనుమతి ఇస్తుంది. అలాంటిది మహికా తరచూ హార్దిక్‌తో కనిపించడం అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా హార్దిక్ కూడా తన ప్రేమను బహిరంగంగానే చూపిస్తున్నాడు. మ్యాచ్‌ల సమయంలో బౌండరీ దగ్గర నుంచి ఆమెకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్నాడు. మెగా టోర్నమెంట్‌లో ఈ జంట కలిసి ఉండడం గమనార్హం.

హార్దిక్ పాండ్యా– మహికా శర్మ బంధంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు హార్దిక్ సంతోషంగా ఉండటం మంచిదని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది అతని ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. పాండ్యా బ్యాటింగ్ కంటే ఎక్కువగా భామ మీద ఫోకస్ పెడుతున్నాడుని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. హార్దిక్ పూర్తిగా ఆటపై దృష్టి పెట్టాలి.. బయట విషయాలపై కాదని మరొకరు సూచించారు.