Team India: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 తొలి మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషాటే కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు టాప్ ఆర్డర్‌లో ఒక రైట్‌హ్యాండ్ బ్యాటర్ అవసరం ఉంది, ముఖ్యంగా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలా? అనే అంశంపై రాబోయే రోజుల్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మేము ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులు పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్‌తోనే తొలి వికెట్ తీసుకుంటున్నారు. దాదాపు ప్రతిసారి జీరోకే వికెట్లు కోల్పోతున్నాం.. దీంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతోంది అని అన్నారు. సంజూ శాంసన్ రైట్‌హ్యాండ్ బ్యాటర్ కావడం జట్టుకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. కానీ అతడి ఫామ్ కూడా పెద్దగా బాగోలేదని చెప్పుకొచ్చారు. 2025 నుంచి ఇప్పటివరకు సంజూ 17 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 290 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం. గత 18 నెలలుగా జట్టుకు సేవలందిస్తున్న ఆటగాళ్లనే కొనసాగించాలా?.. లేక రైట్‌హ్యాండ్ బ్యాటర్ అవసరం కోసం సంజూను తీసుకురావాలా? అన్నదే మా ముందున్న ప్రశ్న.. దీనిపై చర్చ జరుగుతుంది అని రయాన్ వెల్లడించారు.
ALSO READ : ఈగోను వదిలి పెట్టి.. జింబాబ్వే మ్యాచ్కి ఈ ఒక్క మార్పుతో వెళ్లండి
అభిషేక్ శర్మ ఫామ్ లేకపోవడానికి ఫుడ్ పాయిజనింగ్ కూడా ఒక కారణమని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ రయాన్ తెలిపారు. ఆ కారణంగా అతడు బరువు తగ్గాడని, పూర్తిగా సిద్ధం కావడంలో ఇబ్బంది పడ్డాడని పేర్కొన్నారు. మూడు మ్యాచులలో డకౌట్లు ఆటగాడిపై మానసికంగా ప్రభావం చూపుతాయి.. నెట్స్‌లో మాత్రం అతడు మంచి ప్రదర్శన చూపించాడు. అభిషేక్ ని మళ్లీ ఫామ్‌లోకి తీసుకురావడం మా బాధ్యత అన్నారు. ఇక
ఫినిషర్‌గా ఆడుతున్న రింకూ సింగ్‌కు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు, ఆ స్థానం చాలా కఠినమైనదని చెప్పారు. అయినా ఆ పాత్రకు న్యాయం చేస్తారని తెలిపారు.
ఇప్పుడు మాటల కన్నా పని తనం ముఖ్యం అని రయాన్ పేర్కొన్నారు. జట్టు మొత్తం కలిసి కష్టపడాలి.. జింబాబ్వేతో వచ్చే కీలక మ్యాచ్‌కు ముందు మేము మళ్లీ సమీకరించుకుని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని రయాన్ టెన్ డోషాటే అన్నారు. దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ టాప్ ఆర్డర్ కాంబినేషన్, అభిషేక్ శర్మ ఫామ్, సంజూ శాంసన్ ఎంపిక లాంటి అంశాలు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సవాళ్లుగా మారిపోయాయి.
లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్లు:
* అభిషేక్ శర్మ
* తిలక్ వర్మ
* శివం దూబే
* అక్షర్ పటేల్
* రింకూ సింగ్
* వాషింగ్టన్ సుందర్
