పెద్దపల్లికి ఏకలవ్య పాఠశాల ఇవ్వలేం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై

పెద్దపల్లికి ఏకలవ్య పాఠశాల ఇవ్వలేం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ప్రశ్నకు కేంద్రం రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఇవ్వలేమని కేంద్రం వెల్లడించింది. ఈ ఏకలవ్య స్కూల్స్ ఇవ్వాలంటే కనీసం 20 వేల మంది గిరిజనులు ఉండాలనే నిబంధన ఉందని పేర్కొంది. 

అయితే ఈ జిల్లాల్లోని ఏ బ్లాక్ లోనూ 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా లేరని వెల్లడించింది. అవేమీ ఈ ప్రాంతంలో లేవని, అందుకే ఏకలవ్య పాఠశాలలేవీ మంజూరు కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం లోక్ సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే రాతపూర్వక సమాధానం ఇచ్చారు.