200 ఉద్యోగాలకు డిసెంబర్ 22న ఓయూలో జాబ్ మేళా

200 ఉద్యోగాలకు డిసెంబర్ 22న ఓయూలో జాబ్ మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్​మెంట్ బ్యూరో ఆవరణలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వర్సిటీ ఎంప్లాయ్​మెంట్ ఇన్ఫర్మేష‌‌న్‌‌, గైడెన్స్ బ్యూరో చీఫ్ ఆఫీసర్​టి.రాములు తెలిపారు. జాబ్ మేళాలో మెడ్‌‌ప్లస్ గ్రూప్ కంపెనీ పాల్గొంటుంద‌‌ని.. ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్​లోని రెండు విభాగాల్లో దాదాపు 200 పోస్టులు భ‌‌ర్తీ చేసేందుకు డిప్లొమా ఇన్​ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ ఉండి 18 నుంచి 30 ఏండ్ల లోపు వ‌‌య‌‌స్సు ఉన్నవారు అర్హులన్నారు.

బ‌‌యోడేటా, విద్యార్హత‌‌ల జిరాక్స్ స‌‌ర్టిఫికెట్లతో 22న ఉద‌‌యం 11 గంట‌‌లకు హాజరవ్వాలన్నారు. మరిన్ని వివ‌‌రాల‌‌కు  96666 62481 నంబర్​లో సంప్రదించ‌‌గ‌‌ల‌‌ని సూచించారు