శ్రీశైలం ఆలయంలో స్పర్శదర్శన వేళలు మార్పు.. ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం..

శ్రీశైలం ఆలయంలో స్పర్శదర్శన వేళలు మార్పు.. ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం..

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తులకు ప్రత్యేకంగా స్పర్శదర్శనం పొందే అరుదైన అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. స్పర్శ దర్శన వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. 2026 జనవరి నుండి భక్తులకు స్పర్శ దర్శనాల వేళలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 

శని,ఆది,సోమ మరియు ప్రభుత్వ సెలవు దినాలను ప్రత్యేక రోజులుగా గుర్తించిన ఆలయ అధికారులు.. ఆయా రోజుల్లో  3 విడతలుగా బ్రేక్ దర్శనాలు,3 విడతలుగా స్పర్శ దర్శనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల నుంచి ఆన్లైన్లో టికెట్లను భారీగా పెంచినట్లు తెలిపారు ఈవో శ్రీనివాసరావు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in, www.srisailamdevasthanam.org మాత్రమే వినియోగించు కోవాలని కోరారు శ్రీనివాసరావు. సాధారణ భక్తుల సైతం త్వరగా స్వామి అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈవో శ్రీనివాసరావు.