కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

కాంగ్రెస్ లో చేరిన  బీఆర్ఎస్ సర్పంచ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రఘునాథపాలెం మండలం కేవీ  బంజర గ్రామపంచాయతీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన భూక్య సరిత, మాజీ సర్పంచ్ గుండు మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సమక్షంలో మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.