ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. మరో వారం ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. మరో వారం ప్రభాకర్ రావు  కస్టడీ పొడిగింపు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని మరో వారం రోజుల పాటు పొడిగించింది సుప్రీం కోర్టు.  డిసెంబర్ 25 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. డిసెంబర్ 26న కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది సుప్రీంకోర్టు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో డిసెంబర్ 18తో   ప్రభాకర్ రావు  కస్టోడియల్ విచారణ ముగిసింది. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించింది సిట్. అయితే విచారణలో నోరు  ప్రభాకర్ రావు నోరు విప్పడం లేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిపింది.  నిబంధనల ప్రకారమే పనిచేశానని ప్రభాకర్ రావు పోలీసుల విచారణలో చెబుతున్నారు.  ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాలతోనే చేశానన్నాడు ప్రభాకర్ రావు..రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రభాకర్ రావు  స్పష్టత ఇవ్వ లేదు.  రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానం ఇచ్చాడు.  హార్డ్‌డిస్కులు ధ్వంసం నిబంధనల ప్రకారమేనని చేశానని ప్రభాకర్ రావు చెప్పాడు.  ఈమెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందన్నాడు.  ట్యాపింగ్ డివైజ్‌లు అమెరికాలోనే మరిచి పోయానని విచారణలో చెప్పాడు  ప్రభాకర్ రావు.  ఈ వారం రోజుల విచారణ వివరాలను ఇవాళ డిసెంబర్ 19న  సుప్రీం కోర్టుకు పూర్తి నివేదిక ఇచ్చింది సిట్. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని కోర్టుకు  తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు  ప్రభాకర్ రావు కస్టడీని  వారం రోజులు  పొడిగించింది.

ఫోన్​ ట్యాపింగ్​పై పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో  కేసు నమోదైన తర్వాత సీపీ కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి ఐదుగురు సభ్యులతో స్పెషల్‌‌ టీమ్‌‌ను ఏర్పాటు చేశారు. వెస్ట్‌‌జోన్ డీసీపీ విజయ్‌‌కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసును దర్యాప్తు చేశారు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్‌‌ టీమ్‌‌ ప్రాథమిక సమాచారం సేకరించింది. సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్‌‌ఫెషన్ స్టేట్‌‌మెంట్‌‌లో పలువురు కీలక నేతల పేర్లు పరోక్షంగా వెల్లడయ్యాయి. ఇప్పుడు డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్  టీమ్‌‌ (సిట్​)ను ఏర్పాటు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌‌‌ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్‌‌‌‌ సిట్‌‌ మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది.