పటేల్ విగ్రహ శిల్పి రామ్ సూతార్ మృతి

పటేల్ విగ్రహ శిల్పి రామ్ సూతార్ మృతి

హైదరాబాద్​లోని అంబేద్కర్ విగ్రహ రూపశిల్పీ ఆయనే

నోయిడా/ముంబై: గుజరాత్​లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహ రూపశిల్పి రామ్ సూతార్ వందేండ్ల వయసులో వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బుధవారం రాత్రి నోయిడాలో కన్నుమూశారు. గాంధీ, అంబేద్కర్, శివాజీ వంటి ప్రతిష్టాత్మక విగ్రహాలతో ఆయన గుర్తింపు పొందారు. హైదరాబాద్​ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయనే రూపొందించారు. 

మహారాష్ట్రలోని ధులే జిల్లా గొందూర్​లో1925 ఫిబ్రవరి 19న సూతార్ జన్మించారు. ముంబై జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి గోల్డ్ మెడల్​ తీసుకున్నారు. ఆయనకు 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. రామ్ సూతార్  మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ప్రముఖులు సంతాపం తెలిపారు.