- మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి
సదాశివనగర్, వెలుగు : యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకయాప్‌ను తీసుకొచ్చిందని, రైతులు ఇంట్లో ఉండి కూడా ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చని ఏవో ప్రజాపతి తెలిపారు. గురువారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడి, తిర్మన్‌పల్లి, మర్కల్, సదాశివనగర్, పద్మాజివాడి ఎక్స్ రోడ్డు, ఉత్తునూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ముందుగా అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదిక లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులకు యాప్ వివరాలను తెలిపారు.
ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా జిల్లాలోని డీలర్ల వద్ద ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. రైతులు తమ పంట వివరాలను సాగు విస్తీర్ణం ను నమోదు చేస్తే వెంటనే యూరియా పరిమాణం తెలుపుతుందన్నారు. బుకింగ్ చేసిన తరువాత ఐడీ చూపించి యూరియాను పొందవచ్చన్నారు. కార్యక్రమమంలో ఏఈవోలు కల్యాణి, శ్రీనివాస్ నాయక్, కవిత, గాయత్రీ, శ్రీలక్ష్మి, ప్రణీత, సొసైటీ సీఈవోలు కడెం భైరయ్య, దేవేందర్ రావు, విఘ్నేశ్ గౌడ్, నయిం, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
