సిద్ధిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..

సిద్ధిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..

శుక్రవారం ( డిసెంబర్ 19 ) సిద్ధిపేటలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ క్రమంలో సిద్ధిపేటకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. సిద్దిపేట అర్బన్ మండలం,ఎన్సాన్ పల్లి, తడ్కపల్లి గ్రామాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ నేతలు,కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీలోకి నేతలు, కార్యకర్తలు రావడం సంతోషమని అన్నారు మంత్రి వివేక్. 

సిద్ధిపేటను కాంగ్రెస్ కంచుకోటగా చేసుకునే అవసరం ఉందని... అందరు కలిసి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.సిద్దిపేటలో బిఆర్ఎస్ ను ఖాలి చేస్తామని నేతలు అంటున్నారని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సిద్దిపేట పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారని తెలిపారు మంత్రి వివేక్. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు.

మహెశ్ కుమార్ గౌడ్ ,మినాక్షి నటరాజన్ లు సైతం సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ను నంబర్ వన్ స్థానంలో ఉంచాలన్నారని.. గ్రామ గ్రామాల్లో పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకోని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడాతానని అన్నారు మంత్రి వివేక్.