వికారాబాద్ లో రేపు ( డిసెంబర్ 20 ) జాబ్ మేళా

వికారాబాద్ లో రేపు ( డిసెంబర్ 20 ) జాబ్ మేళా

వికారాబాద్, వెలుగు: న్యూలాండ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ క్యాంపస్ లో గల జిల్లా ఎంప్లాయ్​మెంట్ ఆఫీస్​లో శనివారం ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఇంటర్(ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్​టీ), బీఎస్సీ కెమెస్ట్రీ చదివిన 18 నుంచి 23 ఏండ్ల నిరుద్యోగ యువకులు అర్హులన్నారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ ను 96760 47444 ఫోన్​నంబర్​లో  సంప్రదించాలని పేర్కొన్నారు.