Actor Sivaji: నటుడు శివాజీ మీద డబుల్ అటాక్.. అనసూయ, ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు.. కొత్త పోస్ట్ వైరల్

Actor Sivaji: నటుడు శివాజీ మీద డబుల్ అటాక్.. అనసూయ, ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు.. కొత్త పోస్ట్ వైరల్

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల దుమారం ఏ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో రగడ కొనసాగుతూనే ఉంది. శివాజీ ప్రెస్ మీట్ పెట్టి  తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో పాటుగా, మహిళా కమిషన్ ఎదుట హాజరై ఆ రెండు 'అన్-పార్లమెంటరీ' పదాలకు క్షమాపణలు సైతం తెలిపారు. అయినప్పటికీ.. ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వివాదంలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తమదైన శైలిలో ట్వీట్స్ పెడుతూ విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్గా తెలుగు, తమిళంలో జరిగిన పెద్ద హీరోల ఈవెంట్లలో జరిగిన రెండు సంఘటనలపైనా బాణాలు సందించారు.  

RGV రాజా సాబ్ ఈవెంట్:

ది రాజా సాబ్ ఈవెంట్ను బేస్ చేసుకుని, ఓ ఫోటో షేర్ చేస్తూ నటుడు శివాజీపై ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఈ పోస్టులో హీరోయిన్లను ప్రశంసిస్తూ... ఆయనతో పాటు నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ సెల్ఫీ దిగుతూ కనిపించారు. ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఆర్జీవీ ఇలా రాశాడు..  ‘‘ప్రభాస్ రాజా సాబ్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ ఈ ముగ్గురు హీరోయిన్లు శివాజీ, అతని విషపూరిత బృందం నైతికంగా మొరగడాన్ని పట్టించుకోలేదు. తాము కోరుకున్న దుస్తుల్లోనే వచ్చారు’’ అని ఆర్జీవీ పోస్ట్ చేశాడు. అదే సమయంలో ఆ విలన్లకు గట్టిగా సమాధానం చెప్పిన ఈ ముగ్గురు హీరోలకు హాట్సాఫ్ అని కామెంట్ చేస్తూ ముగించాడు. 

ఇటీవలే ఎక్స్ వేదికగా శివాజీపై ఆర్జీవీ సీరియస్ అయిన విషయం తెలిసిందే.  "ఆ వెధవ పూర్తి పేరు కూడా నాకు తెలియదు.. అందుకే ఇక్కడ కామెంట్ చేస్తున్నాను" అంటూ మొదలుపెట్టిన వర్మ.. అత్యంత కటువైన పదజాలంతో దాడి చేశారు. "హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నాకు అనవసరం. నీలాంటి ఒక అసభ్యకరమైన, పద్ధతి లేని వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి.. వెళ్లి నీ నీతులు వాళ్లకే చెప్పుకో. అంతేకానీ సమాజంలో ఉన్న మహిళలపై గానీ, చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై గానీ నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు. నీ అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

దళపతి విజయ్ సంఘటనతో అనసూయ:

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దళపతి విజయ్‌కు ఎదురైన ఘటనపై నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. అభిమానుల అతిశయంతో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సెలబ్రిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఓ వీడియో పోస్ట్ చేసింది. విజయ్ కి ఎదురైనా చేదు అనుభవాన్ని షేర్ చేస్తూ.. ' నేనేమీ అనట్లేదు' అన్నట్లుగా ఎమోజీ పోస్ట్ చేసింది.

అయితే, గతంలో లాలూ మహల్ మాల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ వస్త్రధారణ విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ పై, అనసూయ పరోక్షంగా రియాక్ట్ అయ్యారని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. “అభిమానమంటే గౌరవం ఉండాలి.. హద్దులు దాటితే ప్రమాదమే” అనేలా కూడా అనసూయ స్పందించి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.