18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000

V6 Velugu Posted on Jan 16, 2022

గోవాలో పర్యటిస్తున్న  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోవాలో 24×7 ఉచిత విద్యుత్ ,  నీరు ఉంటుందన్నారు. రోడ్లు మెరుగుపరచబడతాయని.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తామన్నారు.  మెరుగైన, ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం గోవాలోని ప్రతి గ్రామం, జిల్లాలో మొహల్లా క్లినిక్‌లు , ఆసుపత్రులు ఓపెన్ చేస్తామన్నారు. రైతు సంఘంతో చర్చించి రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

 

Tagged electricity, Arvind Kejriwal, Rs. 1000, every woman 18 yrs

Latest Videos

Subscribe Now

More News