TOXIC: టాలీవుడ్ ట్రేడ్‌లో సంచలనం.. టాక్సిక్ రైట్స్ కొన్న దిల్ రాజు.. పెట్టిన మొత్తం ఎంతంటే?

TOXIC: టాలీవుడ్ ట్రేడ్‌లో సంచలనం.. టాక్సిక్ రైట్స్ కొన్న దిల్ రాజు.. పెట్టిన మొత్తం ఎంతంటే?

కన్నడ స్టార్ యశ్‌‌ హీరోగా రూపొందుతోన్న   ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్టు  ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫ‌‌ర్ గ్రోన్ అప్స్’. గీతూ  మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రానికి   కేవీఎన్‌‌ ప్రొడక్షన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై వెంక‌‌ట్ కె.నారాయ‌‌ణ‌‌తో కలిసి యశ్‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 19న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్‌‌ను  శ్రీవెంక‌‌టేశ్వర క్రియేష‌‌న్స్ బ్యాన‌‌ర్‌‌పై ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ క‌‌మీష‌‌న్ బేసిస్‌‌) భారీ మొత్తంతో తెలుగు హక్కులను తీసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌గా మారింది.  

నాన్ తెలుగు సినిమా కోసం జరిగిన ఆల్‌‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌‌ ఇదేనని పలువురు  సినీ ప్రముఖులు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇండియ‌‌న్ సినీ ఇండ‌‌స్ట్రీలోని పెద్ద స్టార్స్‌‌లో య‌‌శ్ ఒక‌‌రు. కేజీయఫ్  2 త‌‌ర్వాత ఆయ‌‌న మార్కెట్ మ‌‌రింత‌‌గా పెరిగింది. దీంతో ‘టాక్సిక్’ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల త‌‌ర్వాత వ‌‌స్తోన్న ఈ సినిమాపై  అంచ‌‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. 

►ALSO READ | Euphoria: పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘యుఫోరియా’.. గుణశేఖర్ టీమ్ హ్యాపీ

ఇలాంటి ప్రెస్టీజియ‌‌స్ మూవీని మా ఎస్‌‌వీసీ బ్యాన‌‌ర్‌‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండ‌‌టం చాలా ఆనందంగా ఉంది. య‌‌శ్‌‌తో ఇలాగే మ‌‌రిన్ని సినిమాలు చేయాల‌‌ని ఆశిస్తున్నాం’ అని అన్నారు.  కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి ముఖ్య  పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.