బషీర్బాగ్, వెలుగు: దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీ మరోసారి నాంపల్లి కోర్టులో హాజరు కాలేదు. హోటల్ యజమాని నందు కుమార్ వేసిన కేసులో శుక్రవారం విచారణకు దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా హాజరు కావాల్సి ఉంది.
అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు వారి తరఫు అడ్వకేట్ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ‘కోర్టుకు హాజరు కాలేనంత బిజీగా ఉన్నారా?, వచ్చే వాయిదాకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని జడ్జి దగ్గుబాటి ఫ్యామిలీని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో కథనాలు రాగా, దగ్గుబాటి ఫ్యామిలీ లీగల్ టీం ఖండించింది.
