‘దక్షిణ’ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

‘దక్షిణ’  మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూతురుగా నటించి ఆకట్టుకున్న కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సిక, తమిళంతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమధ్య ‘షికారు’ లాంటి కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన ఆమె, ఈసారి ‘దక్షిణ’ అనే లేడీ ఓరియెంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఛార్మితో మంత్ర, మంగళ లాంటి థ్రిల్లర్స్ తీసిన ఓషో తులసీరామ్ దీనికి దర్శకుడు. అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఇటీవల ధన్సిక పుట్టినరోజు సందర్భంగా మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ధన్సిక పేరు వినగానే ‘కబాలి’ గుర్తొస్తుంది.

మా సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ఫేమ్ ధన్సిక అంటారు. ఆమె క్యారెక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్‌‌గా ఉంటుంది. హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందామె. కథతో పాటు తన పాత్ర హైలైట్ అవుతుంది’ అన్నారు. ‘ఇదొక సైకో థ్రిల్లర్. ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్ పూర్తయింది. గోవా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో షూట్ చేశాం. వచ్చే నెల వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిపే షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూట్ మొత్తం కంప్లీట్ అవుతుంది’ అని దర్శకుడు చెప్పారు. రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సంగీతం అందిస్తున్నారు.