ఆధ్యాత్మికం: జులై 16 నుంచి దక్షిణాయనం.. పితృ దేవతలను ఇలా స్వర్గానికి పంపండి..!

ఆధ్యాత్మికం: జులై 16 నుంచి దక్షిణాయనం.. పితృ దేవతలను  ఇలా స్వర్గానికి పంపండి..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు జులై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.  అప్పటి నుంచి ఆరు నెలలపాటు ఉండే కాలాన్ని దక్షిణాయనం అంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  దక్షిణాయనంలో పితృ దేవతలను ఎందుకు స్మరించాలి.. ఎలాంటి పూజలు చేయాలి.. ఏ దేవుడిని పూజించాలి.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

 జ్యోతిష్య శాస్త్రం.. 12 రాశులు.. నవ గ్రహాలు .. 27 నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది.  నవగ్రహాలకు రారాజు సూర్యుడు.  సూర్యుడి గమనం ఆధారంగానే ఉత్తరాయణం... దక్షిణాయనం ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా దక్షిణాయనంలో పితృదేవతలను స్మరించుకుని వారికి ప్రత్యేక పూజలు చేస్తే.. స్వర్గానికి చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.   

 ఉత్తరాయణం దేవతలకు...దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు.దక్షిణాయనంలో పుణ్యనదుల స్నానాలు చేయడం,విష్ణు సహస్రనామపారాయణం..శ్రీ వరాహస్వామివారిని పూజించడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. 

ఆషాఢ మాసంలో ఎలాంటి పండుగలు లేకపోయినా గ్రామ దేవతలను పూజిస్తారు. దక్షిణాయన ఆరంభకాలమైన ఆషాఢం తరువాత వచ్చే  మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. 

ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి  ప్రవేశంతో సూర్యుడు దక్షిణాదికి పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు ...  పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు  పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయని విశ్వశిస్తుంటారు.

దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాలు వంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదని పండితులు చెబుతుంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. 

కర్కాటక సంక్రమణ సమయంలో..  దక్షిణాయనంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది.   కులదైవాన్ని.. లేదా ..  శ్రీ మహా విష్ణువును  తులసి పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  అలాగే పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తే వారు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం  ఒక్క గ్రహం రాశి మారటానికి  కొంత సమయం ఉంటుంది. చంద్రుడు ... ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి  మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి రెండున్నర రోజులు అంటే 60 గంటలు పడుతుంది. అదే శని గ్రహం  ఒక రాశినుంచి మరో రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.  కాని అదే రాశిలో ఒక ఇంటి నుంచి మరో ఇంటిలోకి మారుతూ ఉంటాడు. . ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. 

ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కోరాశిచొప్పున(మేషం నుంచి మీనరాశి వరకు)పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్తవుతుంది. 

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని
సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని
సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని
సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని

ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అంటే జరగటం..  ప్రవేశించటం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.సూర్యుడు జులై 16 న కర్కాటక సంక్రమణం చేయనున్నాడు.  ఈ కర్కాటక సంక్రమణాన్ని దక్షిణాయనం అని అంటుంటారు. 

పండితులు చెప్పిన వివరాల ప్రకారం.. మనకి సంవత్సరానికి రెండు  అయనములు ఉంటాయి రెండు. ఒకటి ఉత్తరాయనం.. రెండవది దక్షిణాయనం.   సూర్యుడు  కన్యా రాశి ప్రవేశించిన తరువాత  ... వినాయక చవితి తులారాశిలో ఉన్న సమయంలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రమణంలో సూర్యుడు ఉన్నప్పుడు సం క్రాంతి...  కుంభరాశి ప్రవేశంలో ...మహాశివరాత్రి  పండుగలు జరుపుకుంటాము. 

సూర్యుని మకర సంక్రమణమమే ఉత్తరాయన పుణ్యకాలమని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి.  ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణం...  దక్షిణాయనం మనేవి. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ... జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.

సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి .. మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం  దక్షిణాయనం( ఆరు నెలలు).   ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.  దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు.  అంటే మనకు ఒక సంవత్సరం అయితే .. దేవతలకు ఒక రోజు.. అందుకే పెద్దలకు వారు మరణించిన తిథి రోజు వారికి ఆహారం అందించేందుకు ఎవరి కుటుంబ ఆచారం ప్రకారం  ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు.

దక్షిణాయనంలో అంటే జులై 16 నుంచి ఆరు నెలల పాటు  చేసే పుణ్య స్నానాల వలన ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.ఇంకా  దారిద్య్ర బాధలకు విముక్తి కలుగుతుంది.ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి (దానాలకు) దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.  పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. సో.. మనందరము  దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.