హైదరాబాద్సిటీ, వెలుగు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని పలు క్రైస్తవ సంఘాలు డిమాండ్చేశాయి. సోమవారం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట సత్యాగ్రహం చేపట్టాయి.
దళిత క్రైస్తవులకు సమాన హక్కులు, గౌరవం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మత పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
