నాకు మంత్రి పదవి ఇవ్వడమనేది హైకమాండ్ ఇష్టం: దానం నాగేందర్

నాకు  మంత్రి  పదవి ఇవ్వడమనేది హైకమాండ్ ఇష్టం: దానం నాగేందర్
  •  జూబ్లీ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్సే
  •  సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ : తనకు మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టమని  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు మినిస్ట్రీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్  పార్టీయేనని అన్నారు. 

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారో చెప్పాలని  డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు చైర్మన్ ను నియమించిన కేంద్రం.. ఆఫీసు  పెట్టలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేటీఆర్ స్వీకరించాని, సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దనిఇ అన్నారు. ఎబ్బీ స్టేడియంలో జరిగిన గ్రామస్థాయి సదస్సు ప్రతి నియోజకవర్గంలో  నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని, ముందుగా తన సెగ్మెంట్ లోనే నిర్వహించాలని కోరుతానని దానం చెప్పారు.