దసరా పండుగ సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 28 నుంచి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 14న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు, ఇతర విద్యా సంస్థలకు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు దసరా పండుగ సెలవులను ప్రకటించి ఏపీ సర్కారు.

