గొట్టంగాళ్లతో చర్చకు రాం… టెన్త్ ఫెయిల్ ఆకురౌడిగాడివి

V6 Velugu Posted on Feb 28, 2021

  • ఉద్యోగాలపై రాద్ధాంతం చేసే.. గొట్టంగాళ్లకు జవాబు చెప్పం
  • కేటీఆర్​కు సవాల్​ చేసే స్థాయి దాసోజు శ్రవణ్​కు లేదు: తలసాని

కంటోన్మెంట్(హైదరాబాద్), వెలుగు: మంత్రి కేటీఆర్​కు సవాల్​ చేసే స్థాయి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కు లేదని మంత్రి తలసా ని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. ఉద్యోగాల లెక్కలపై కేటీఆర్​ను శ్రవణ్​ నిలదీయడంపై మండిపడ్డారు. ‘‘నిన్న ఓ గొట్టంగాడు గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని.. నేను ఇక్కడున్నాను.. ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్​ రావాలె అంటూ మాట్లాడిండు. మంత్రి రావాలంటే.. వస్తడా? అతనిది కేటీఆర్​కు సవాల్​ విసిరేటంత స్థాయి కాదు. అలాంటి వాళ్లకు మేం సమాధానాలు చెప్పం” అని తలసాని కామెంట్​ చేశారు. ఉద్యోగాలపై స్పష్టత కావాలంటే ఆర్టీఐ యాక్టు కింద వివరాలు తెప్పించుకుని చూసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి శనివారం సికింద్రాబాద్​లో నిర్వహించిన టీఆర్ఎస్​ మీటింగ్​లో తలసాని మాట్లాడారు. జనానికి అది చేస్తం, ఇది చేస్తమని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారని.. మరి మూడేండ్లు తమ ప్రభుత్వమే ఉంటే వాళ్లు ఏం చేస్తారని ప్రశ్నించా రు. ఉద్యోగులకు పీఆర్సీ, ప్రమోషన్లు ఇచ్చేది టీఆర్ఎస్​ సర్కారేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు తాడులేని బొంగరంలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి మాటల్ని నమ్మొద్దన్నారు.

  • ఉద్యోగాలపై మాట్లాడితే..  ఆకు రౌడీతో తిట్టిస్తరా?
  • తలసాని ఓ రాజకీయ బిచ్చగాడు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: ‘‘తలసాని బుద్ధిలేని సన్నాసి. తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్​కు ఏం సంబంధం. ఆ ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్ యాదవ్​తో తిట్టించటం కేటీఆర్ కు తగదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ బిచ్చగాడు తలసాని. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడితే గొట్టంగాళ్లంటూ కామెంట్లు చేస్తరా? ఈ గొట్టంగాళ్లే మీకు కర్రుకాల్చి వాత పెడ్తరు” అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆయన శనివారం గాంధీభవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. చెంచాగిరీ చేసే తలసానికి నిరుద్యోగుల గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యోగాలపై చర్చకు రెడీ అని చెప్పిన మంత్రి కేటీఆర్.. తేలుకుట్టిన దొంగలా పారిపోయాడని   విమర్శిం చారు. కేటీఆర్  తన పేరును తోకముడిచిన రామారావుగా మార్చుకోవాలని కామెంట్​ చేశారు. 2009లో కేటీఆర్​ తన ఇంటికొచ్చి, బతిమాలి టీఆర్ఎస్​లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా దిగిపోయే నాటికి లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, కాంగ్రెస్ హయాంలో 10 వేల ఉద్యోగాలే వచ్చాయనడం అబద్ధమని చెప్పారు. తాను చెప్పేది తప్పని కేటీఆర్​ గన్ పార్క్ దగ్గరికి వచ్చి నిరూపించాలని సవాల్​ చేశారు.

Tagged TRS, Telangana, Congress, KTR, Minister Talasani Srinivas Yadav, jobs, Dasoju Shravan

Latest Videos

Subscribe Now

More News