కాంగ్రెస్ కు సంజయ్ కొమ్ము కాస్తున్నరు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్

కాంగ్రెస్ కు సంజయ్ కొమ్ము కాస్తున్నరు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌పై దాడి జరిగిన తీరు చూస్తుంటే.. పోలీసులు, బీజేపీ నేతలు కలిసే ఈ దాడికి పాల్పడినట్లు కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు.అక్కడ ఇంటెలిజెన్స్, పోలీసులు ఏం చేస్తున్నా రని నిలదీశారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 

భారత్ మాతాకీ జై అనే వారు.. అమ్మకు, అబ్బకు పుడితే అని మాట్లాడతారా? అంటూ సంజయ్ వ్యాఖ్యలను ఉద్దేశించి నిలదీశారు. గురువారం తెలంగాణభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎక్కడ చూసినా రేవంత్​ రెడ్డి దోపిడీనే కనిపిస్తున్నదని, విద్యా సంస్థలను దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. రేవంత్​ కనుసన్నల్లో సెంట్రలైజ్డ్​ అవినీతి జరుగుతున్నదన్నారు. టెండర్లపై రేవంత్​రెడ్డి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.