
హైదరాబాద్, వెలుగు: వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ జైలు శిక్ష రద్దయింది. ఉద్యమ సమయంలో రైల్‌రోకో నిర్వహించినందుకు వినయ్ భాస్కర్‌తో పాటు 18 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును 2021లో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారించింది.
విచారణ అనంతరం వినయ్ భాస్కర్ కు కోర్టు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. వినయ్ భాస్కర్ అప్పీల్‌ను శుక్రవారం అనుమతించిన జస్టిస్ కె.లక్ష్మణ్, కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.