జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్

జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఆగస్టు  13 వరకు ఈ  సమావేశాలు కొనసాగుతాయని లోక్ సభ సెక్రటరీ వెల్లడించారు.  జూలై 18, 19, 20, 21, 22, 25, 26, 27, 28, 29తో పాటు ఆగస్టు 1, 2, 3, 4, 5, 8, 10,12, 13 వరకు జరుగుతాయని ప్రకటించారు.   లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఉదయం 11 గంటల నుండి ప్రారంభమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించనున్నారు. 

మరోవైపు గత పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ స్పూపింగ్ కుంభకోణం, రైతుల నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ధరల పెరుగదల, ఇంధన ధరల పెంపుపై ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు ఉభయ సభలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.  అయితే ఈ సారి కూడా పార్లమెంట్ సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగనున్నాయి. ముఖ్యంగా అగ్నిపథ్ సహా పలు అంశాలపై విపక్షాలు నిరసనలతో హోరెత్తించే అవకాశాలున్నాయి.  పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో..ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.