శంకరపట్నం: కూతురే కొడుకై తండ్రికి తల కొరివి

శంకరపట్నం: కూతురే కొడుకై  తండ్రికి తల కొరివి

శంకరపట్నం, వెలుగు: కూతురే కొడుకై తండ్రికి చితికి తల కొరివి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల రాయమల్లు(64) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. 

ఆయనకు కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు సరిత తండ్రికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తిచేసింది. తండ్రి చితికి కూతురు కొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది.