కూతురు శారీ ఫంక్షన్ రోజే షాక్ కు గురై తల్లి మృతి.. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఘటన

కూతురు శారీ ఫంక్షన్ రోజే షాక్ కు గురై తల్లి మృతి.. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఘటన

పాపన్నపేట, వెలుగు: కూతురు శారీ ఫంక్షన్ రోజే కరెంట్ షాక్‌‌తో తల్లి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్‌‌లో సోమవారం జరిగింది. ముద్దాపూర్ గ్రామానికి చెందిన పోలీసు పార్వతి(35) కూతురి శారీ ఫంక్షన్ కోసం ఉదయం బీరువాలో ఉన్న కొత్త బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయింది. 

కుటుంబ సభ్యులు కరెంట్ ఆఫ్ చేసి మెదక్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకడంతో అవి తెగిపోయి అల్మరాకు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కూతురి ఫంక్షన్ రోజే తల్లి మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.