
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. మరికొన్ని సంవత్సరాలు మాత్రమే షార్ట్ ఫార్మాట్ లో ఆడాలని భావిస్తున్నాడు. టెస్టులు, వన్డేల్లో ఎక్కువ కాలం కొనసాగడంతో పాటు ఫ్యామిలీకి టైమ్ కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నాడు.‘రాబోయే రోజుల్లో మేం చాలా టీ20లు ఆడబోతున్నాం. వరుసగా రెండు వరల్డ్‌కప్స్ కూడా ఉన్నాయి. కొంతకాలం తర్వాత నేను ఓ ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే మూడు ఫార్మాట్లూ ఆడడం చాలా కష్టమైన పని. అయితే, ఈ చాలెంజ్ ను స్వీకరించి మూడింటిలో కొనసాగాలనుకునే ప్లేయర్లకు గుడ్ లక్ . నా వరకు ఇంట్లో భార్య,ముగ్గురు పిల్లలను పెట్టుకొని తరచూ ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తది’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు.