గోవులను చంపితే జైళ్లోకే.. యూపీ సీఎం యోగి హెచ్చరిక

గోవులను చంపితే జైళ్లోకే.. యూపీ సీఎం యోగి హెచ్చరిక

న్యూఢిల్లీ: గోవులను చంపేవారిపై చట్టంలోని పారామితుల మేర కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. నవంబర్ 3న యూపీలో ఒక లోక్ సభ సీటు, 56 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి.. గోవధపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోవులను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎవరైనా ఆవులను చంపితే వారిని తప్పక జైలుకు పంపుతామని హెచ్చరించారు. గోవులను రక్షించేందుకు యూపీలోని అన్ని జిల్లాల్లో గోశాలలను నిర్మించామన్నారు. ఆవులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గోవధ చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై తాజాగా అలహాబాద్ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ విధంగా కామెంట్స్ చేయడం గమనార్హం.