నారాయణగూడ, వెలుగు: పగటిపూట తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన హఫీజుల్ షేఖ్(37)ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చి, పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు. హిమాయత్ నగర్లో రెండు ఇళ్లలో సుమారు 42 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కూకట్పల్లి, సనత్ నగర్, నారాయణగూడ పరిధిలో మొత్తం ఆరు చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.
