హసన్ పర్తి, వెలుగు: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్ హసన్ పర్తిలోని పీఏసీఎస్ భవనంలో త్వరలో ప్రారంభం కానుంది. మండల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేసేందుకు ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా రైతులకు పంట రుణాలు, పశుసంవర్ధక రుణాలు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లోన్స్ నేరుగా ఇవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, అదనంగా సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ లాంటి సేవలు కూడా అందించనున్నట్లు తెలిపారు. సభ్యులు, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.

