తిరుపతి, చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుమలకు.. కాలినడకన వెళ్తున్న భక్తులపై డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థతి సీరియస్ గా ఉంది. గాయపడిన వారికి తిరుపతి రుయా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు.
