
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఏరియాలో గుర్తు తెలియని డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. చిక్కడపల్లి ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం గాంధీ మెట్రో స్టేషన్ కింద ఓ డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో గాంధీ మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి 50 ఏండ్లు ఉండొచ్చని.. వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.