పీహెచ్​డీ థీసిస్ సబ్మిషన్లకు డెడ్ లైన్

పీహెచ్​డీ థీసిస్ సబ్మిషన్లకు  డెడ్ లైన్

సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్​డీ థీసిస్ సబ్మిషన్​కు అధికారులు గడువు పెట్టడాన్ని రీసెర్చ్ స్కాలర్లు వ్యతిరేకిస్తున్నారు. 2016కు ముందు పీహెచ్​డీ కోర్సుల్లో చేరిన వాళ్లు ఈనెల 31లోగా తమ థీసిస్​ను పూర్తి చేసి వర్సిటీకి అందించాలని అధికారులు డెడ్​లైన్​పెట్టారు. గడువులోగా థీసిస్​ ఇవ్వకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. ఈ నిర్ణయంతో 12 విభాగాల్లో రీసెర్చ్​లు చేస్తున్న సుమారు 1200 మంది స్టూడెంట్లు ఆందోళనలో పడ్డారు. ఇంత తొందరగా థీసిస్ సబ్మిట్​ చేయడమంటే సాధ్యం కాదని , కరోనా ఎఫెక్ట్ తో చాలా ఇబ్బందులు వచ్చాయని వారు అంటున్నారు.  ఇప్పటికీ 75శాతం కూడా థీసిస్​ పూర్తి కాలేదనీ చాలా మంది స్టూడెంట్లు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులో డెడ్​లైన్ పెడితే.. ఇన్నేండ్ల కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. 


2 వేలకుపైగా రీసెర్చ్ స్కాలర్లు


ఓయూలోని ఆర్ట్స్​, సోషల్​సైన్స్, సైన్స్, కామర్స్ అండ్​బిజినెస్​మేనేజ్​మెంట్, ఇంజినీరింగ్. టెక్నాలజీ, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్లలో సుమారు 2 వేలకు పైగా స్కాలర్లు పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో కొంత మంది మాత్రమే థీసిస్​ పూర్తి చేయగా, మరో 1200 మంది స్కాలర్లు ఇంకా ప్రాజెక్ట్​ వర్క్​లో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ తో రెండేండ్లుగా థీసిస్​పై వర్క్​చేయడం ఇబ్బందిగా మారిందని రీసెర్చ్ స్కాలర్లు చెప్తున్నారు. స్కాలర్ షిప్​లు, ఫెలోషిప్ లు నిలిచిపోయాయన్నారు. గైడ్స్ గా  ఉన్నవాళ్లు అడ్మినిస్ట్రేటివ్​పదవుల్లో ఉండటంతో టైమ్ కి దొరకడం లేదంటున్నారు. ఎన్నో కారణాల వల్ల థీసిస్​లేట్ అవుతోందని, టైమ్​లిమిట్​ విధించి ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు.   ఓయూ వీసీ ప్రొఫెసర్ సురేశ్​ కుమార్ గతంలో రిజిస్ట్రార్ గా ఉన్న టైమ్ లో ఐదేండ్లు దాటిన రీసెర్చ్ స్కాలర్ల కోసం స్పెషల్ సర్క్యూలర్ జారీ చేశారని రీసెర్చ్ స్కాలర్లు చెప్తున్నారు. దీని ప్రకారం.. ఐదేండ్లు దాటిన వాళ్లు ఆన్​రోల్​స్టూడెంట్స్ కిందకి రారని,  వారు వర్సిటీలో కొనసాగుతూ రీసెర్చ్  పూర్తి చేసే అవకాశమున్నా  ఎలాంటి స్కాలర్​షిప్ లు, ఫెలో షిప్ లు మంజూరు కావని సర్క్యూలర్ లో ఉందంటున్నారు. ఓయూ అధికారులు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకుడు కాంపెల్లి శ్రీనివాస్ అన్నారు. థీసిస్ సబ్మిషన్ కు డెడ్ లైన్ పెట్టడం గ్రామీణ, పేద స్టూడెంట్లను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలో భాగమని వర్సిటీ అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకుడు శ్రీహరి డిమాండ్ చేస్తున్నారు.

‘వెలుగు ఎఫెక్ట్’      ..కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు


ఓయూ అధికారులు 20 రోజుల తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లకు నవంబర్ నెల వేతనాన్ని చెల్లించారు.  15 రోజుల దాటినా వేతనాలు రాక ఇబ్బందులు పడుతుండటంతో  ఈ నెల 17న వెలుగు పేపర్ లో ‘కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు ఇయ్యలే’ హెడ్డింగ్​తో కథనం పబ్లిష్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఓయూ అధికారులు  సోమవారం కాంట్రాక్ట్ లెక్చరర్ల బ్యాంకు అకౌంట్లలో జీతం డబ్బులు జమ చేశారు.