రూ.2 వేల నోటుకు.. మరో వారమే గడువు

రూ.2 వేల నోటుకు.. మరో వారమే గడువు

రూ.2000 నోట్లను మార్చుకునేందుకు మరో వారం గడువు మాత్రమే ఉంది. 2వేల నోట్ల చెల్లుబాటుకు సెప్టెంబర్ 30ని డెడ్ లైన్గా  రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రూ. 2,వేల నోట్లను కలిగి ఉంటే వాటిని చివరి తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్  సూచించింది. 

2023 మే 19న రూ. 2వేల నోట్లను రద్దు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. 2023 మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.